నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు..ఫెర్టిలైజర్స్‌ షాప్‌ ఎదుట ఆందోళన

నకిలీ వారి విత్తనాలు అమ్మిన ఫర్టిలైజర్ దుకాణం ముందు రైతులు ఆందోళన చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంకల్ప ఫర్టిలైజర్ షాప్ ముందు చోటుచేసుకుంది.

Update: 2024-10-03 16:39 GMT

దిశ,నాగర్ కర్నూల్ : నకిలీ వారి విత్తనాలు అమ్మిన ఫర్టిలైజర్ దుకాణం ముందు రైతులు ఆందోళన చేసిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంకల్ప ఫర్టిలైజర్ షాప్ ముందు చోటుచేసుకుంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం చర్ల ఇటికల గ్రామానికి చెందిన చాపల శాంబయ్య, చంద్రయ్య తోపాటు మరో ఐదుగురు రైతులు కలిసి నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాల్లోని సంకల్ప అనే ఫస్ట్ లైజర్ దుకాణంలో జులై 5వ తేదీన ఆర్ ఎన్ ఆర్(15048) రకం 150 కిలోల వరి విత్తనాలు కొన్నారు. ఆగస్టు 27 తారీఖున నాలుగు ఎకరాలలో వరి నాటారు. సెప్టెంబర్ 23న పూత రావడం, ఈనాడం మొదలైంది. రైతులు పంపిణీ వారికి సమాచారం ఇచ్చారు. కంపెనీ వారు వచ్చి చూసి ఏం సమాధానం చెప్పకుండా తిరిగి వెళ్లారు. దీంతో ఈ విషయాన్ని తాడూరు మండల ఏఈఓకు రైతులు చెప్పారు. ఏఈఓ స్పందించకపోవడంతో..గురువారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సంకల్ప ఫర్టిలైజర్ షాప్ ముందు నిరసనకు దిగారు. కంపెనీపై చర్యలు తీసుకొని తమకు నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ ఏడి అధికారి వాసు సంకల్ప పర్టిలైజర్ దుకాణానికి చేరుకున్నారు. రైతు శాంబయ్య అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. కృష్ణ సీడ్స్ క్రాప్టెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కరీంనగర్ నుంచి సంకల్ప ఫర్టిలైజర్ దుకాణానికి విత్తనాలు వచ్చినట్లు ధృవీకరించారు. ఈ కంపెనీపై ఇప్పటికే చాలా కంప్లైంట్ వచ్చాయని, ఇంకా ఎవరెవరికి ఇచ్చారని సమాచారం సేకరిస్తున్నామన్నారు. గ్రామాల్లోకి వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.


Similar News