Minister Jupally : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, రైతు రుణమాఫీతో రైతాంగాన్ని రుణ విముక్తి చేశామని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Update: 2024-09-19 12:15 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని, రైతు రుణమాఫీతో రైతాంగాన్ని రుణ విముక్తి చేశామని రాష్ట్ర ఎక్సైజ్,పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గురువారం స్థానిక మార్కెట్ క‌మిటీ కార్యాల‌య ఆవ‌ర‌ణ‌లో మంత్రి జూప‌ల్లి కృష్ణారావు స‌మ‌క్షంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బెక్కెరి అనిత, వైస్ చైర్మెన్ గా పెద్ద విజ‌య్ కుమార్ లతో పాటు క‌మిటీ స‌భ్యుల ప్ర‌మాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ…రైతు సంక్షేమ‌మే ధ్యేయంగా ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌న్నారు.

ఆరు గ్యారెంటీలతో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రజాపాలనతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతుందని, ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు సముచిత గౌరవం లభించిందన్నారు. ఈ క‌మిటీలో ముఖ్య‌మంత్రి అన్ని వ‌ర్గాల వారికి స‌ముచిత ప్రాధాన్యత‌ క‌ల్పించార‌ని తెలిపారు. రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం ఎప్పటికప్పుడు కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో,ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జీ.మ‌ధుసూద‌న్ రెడ్డి, పాలకూర్తి ఎమ్మెల్యే యశస్వీని రెడ్డి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కొత్వాల్,ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు.


Similar News