Collector DP : కందనూల్ కలెక్టర్‌ డీపీతో ఫేక్‌ అకౌంట్‌..

సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులనే కాకుండా జిల్లాల కలెక్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు.

Update: 2024-08-07 16:46 GMT

దిశ, నాగర్ కర్నూల్ : సైబర్‌ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అమాయకులనే కాకుండా జిల్లాల కలెక్టర్లను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ బాదావత్ వాట్సప్‌ డీపీతో బుధవారం నకిలీ అకౌంట్‌ను క్రియేట్‌ చేశారు. పలువురు అధికారులతో చాటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని కొందరు కలెక్టర్‌ దృష్టికి తీసుకురావడంతో స్పందించిన కలెక్టర్ నాగర్ కర్నూల్ జిల్లా సైబర్ క్రైమ్ అధికారులకు తెలిపారు. వెంటనే సంబంధిత అకౌంట్‌ ఫోన్‌ నెంబర్‌ పై పోలీసులు దృష్టి పెట్టారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 94782854487 నెంబర్‌తో నకిలీ అకౌంట్‌ను సృష్టించారని, ఈ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చిన చాటింగ్‌ చేసిన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. సైబర్‌ నేరాల విషయంలో నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు. కాగా ఈనెల 2వ తారీఖున మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయెందిర బోయి పేర నకిలీ వాట్సాప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News