నిరుపేదలను ఆర్ధికంగా ఆదుకోవడానికి 'కంటి వెలుగు': ఎమ్మెల్యే బీరం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరూ కళ్ల పరీక్షలు చేయించుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

Update: 2023-01-19 09:22 GMT

దిశ, వీపనగండ్ల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా అందరూ కళ్ల పరీక్షలు చేయించుకోవాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వృద్దులకు ఎమ్మెల్యే బీరం కళ్ల అద్దాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద కుటుంబాల్లో వెలుగులు నింపాలానే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు.

నిరుపేద కుటుంబాలు డబ్బులు లేక అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని, వారిని ఆర్థికంగా ఆదుకోవడానికి ఈ కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి కంటి పరీక్షలతో పాటు.. వృద్ధులకు కంటి వెలుగు కార్యక్రమం అందేలా చూడాలని వైద్యులను, అధికారులను ఆదేశించారు. కంటి చికిత్సతో పాటు అద్దాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ వంశీకృష్ణ, రాజశేఖర్, ఎంపీపీ కమలేశ్వరరావు జడ్పీటీసీ మాధురి కిరణ్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ చంద్రకళ సురేష్ రెడ్డి, ఎంపీటీసీ ఈశ్వరమ్మ వెంకటయ్య, ఎంపీడీవో కథలప్ప తాహసీల్దార్ పాండు నాయక్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More...  కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన అడిషనల్ కలెక్టర్


Similar News