భారీ వర్షాలు.. రెండు మండలాలకు తరుచు విద్యుత్ అవస్థలు

జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, పదర మండలాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతం గుండానే ఉంది.

Update: 2024-08-21 04:35 GMT

దిశ, ఆచ్చంపేట : జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్, పదర మండలాలకు విద్యుత్ సరఫరా పూర్తిగా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతం గుండానే ఉంది. పై రెండు మండలాలకు 33 కెవి, 11 కె.వి ప్రధాన లైన్ లో వర్షాకాలం ప్రారంభం నుండి అనేక సందర్భాలలో అడవి మార్గంలో సాంకేతిక లోపాలు ఏర్పడుతూ ఈ రెండు మండలాలకు ఆరేడు గంటల పాటు విద్యుత్ అంతరాయం ఉత్పన్నమవుతుంది. ఈ క్రమంలో సంబంధిత విద్యుత్ అధికారులు ఎక్కడ లోపం ఏర్పడిందో వాటిని గుర్తించేందుకు నానా యాతన పడుతున్నారు.

వీటన్నిటికీ ప్రధాన కారణం అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో ప్రధాన విద్యుత్ లైన్ల ఉండడం ఆ మార్గంలో మనుషులు వెళ్ళడానికి వీలు లేకపోవడం.. వాటి మార్గాలలో రహదారి లేకపోవడం వలనే విద్యుత్ సాంకేతిక లోపాన్ని గంట లోపల సరి చేయాల్సి ఉంటే సమస్య ఎక్కడుందో గుర్తించడానికి విద్యుత్ సిబ్బంది సుమారు నాలుగు ఐదు గంటలు నాన్న అవస్థలు పడాల్సి రావడం వలన చాలా సందర్భాల్లో ఈ రెండు మండలాల్లో ప్రజానీకం ఐదు ఆరు గంటల పాటు కారు చీకట్లో ఉండాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట వరకు అమ్రాబాద్ మండలం చీకట్లో ఉండగా పదరా మండల ప్రజలు తెల్లవారుజామున 3 గంటల వరకు చీకట్లోనే అవస్థలు పడ్డారు.

సాంకేతిక లోపం ఎందుకు వస్తుంది..

వర్షాకాలంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చినా సందర్భంగా ప్రధాన సబ్ స్టేషన్ నుండి విద్యుత్ సరఫరా అయ్యే 33 కెవి 11 కె.వి విద్యుత్తు లైన్లో ఆకాశంలో మెరుపులు వచ్చిన సమయంలో ఇన్స్ చెడర్స్ అనే పరికరము మెరుపులు విద్యుత్ కావడం మూలంగా విద్యుత్ అంతరాయం ఏర్పడుతుంది. అడవి మార్గంలో అట్టి సమస్యను గుర్తించేందుకు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే మన్ననూరు నుండి వటవర్లపల్లి సార్లపల్లి కుడిచింతలపైలు గ్రామాలకు విద్యుత్ సరఫరా శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో విద్యుత్ స్తంభాలకు చెట్లు కొమ్మలు తాకడం వలన కూడా పై గ్రామానికి నిత్యం అంతరాయం చోటు చేసుకుంటుంది.

రెండు రోజుల్లో..

గత రెండు మూడు రోజుల నుంచి మెరుపులు ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్న సందర్భంగా అమ్రాబాద్ మండలం జంగం రెడ్డి పల్లి గ్రామంలో 11 కెవి ప్రధాన లైన్ మార్గంలో 21 ప్రదేశాలలో ఇన్స్ చెడర్స్ అనే పరికరం ధ్వంసం కాగా సోమవారం సాయంత్రం భారీ మెరుపులతో కూడిన వర్షం రావడంతో మన్ననూరు గ్రామం సమీపంలోని దట్టమైన అడవిలో దర్గా ముందు భాగంలో 33 కెవి లైన్ మార్గం లో ఇన్స్ చెడర్స్ అనే పరికరము ధ్వంసం అయ్యింది ఈ సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయం పట్టగా అట్టి ప్రదేశానికి దట్టంగా ఉన్న అడవి మరోపక్క చిమ్మ చీకటిలో కనీసం మనిషి వెళ్ళడానికి వీలులేని సందర్భంలో కూడా ప్రాణాలను పణంగా పెట్టి ఆ రాత్రి విద్యుత్ సిబ్బంది శ్రమించి రాత్రి ఒంటిగంటకు అమ్రాబాద్ మండలానికి విద్యుత్తును పునరుద్ధరించారు. తిరిగి పదరా మండలానికి విద్యుత్ పునరుద్ధరణ తెల్లవారుజామున మూడు గంటల సమయం అయ్యిందని విద్యుత్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు.

అటవీ శాఖ ఆంక్షలుతో..

విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు అడవి మార్గంలో వెంటనే ప్రదేశాన్ని గుర్తించాలంటే ప్రధాన లైన్ల మార్గం గుండా వెళ్లేందుకు రహదారి ఉండాలని దీంతో పాటు రహదారి మార్గం ఏర్పాటు చేసే క్రమంలో అటవీశాఖ నిబంధనలు అడ్డు రాకూడదని విద్యుత్ అధికారులు సిబ్బంది అంటున్నారు. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామం నుండి వటవర్లపల్లి గ్రామానికి శ్రీశైలం జాతీయ రహదారి గుండా సుమారు 20 కిలోమీటర్లు అడవి మార్గం ఉండడం ఈ మార్గంలో 80 నూతన స్తంభాలు ఏర్పాటు అలాగే 9 కిలోమీటర్ల మేర నూతన కేబుల్ వైర్ పునరుద్ధరణ చేసినప్పటికీ స్తంభాలు ఉన్నచోట పచ్చని చెట్లు తగులుతుండడం వలన షార్ట్ సర్క్యూట్ అవుతూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని దీనిని అధిగమించాలంటే అడవి మార్గంలో ప్రతి స్తంభం వద్ద పచ్చని చెట్లు తగలకుండా ఒక మీటర్ పొడవున చెట్ల కొమ్మలను తొలగించినట్లయితే విద్యుత్ అంతరాయం జరగదని అందుకు అడవి శాఖ అధికారులు సహకారం ఉంటేనే సులువు తరం అవుతుందని విద్యుత్ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులు దృష్టి పెడితే సాధ్యమే..

అమ్రాబాద్ పదరా మండలాలలో వర్షాకాలంలో విద్యుత్ అంతరాయాన్ని అధిగమించాలంటే అటవీశాఖ నిబంధనలు అడ్డంకులు లేకుండా ప్రజాప్రతినిధులు జిల్లా ఉన్నతాధికారులు దృష్టి కేంద్రీకరించి ప్రధాని అడవి మార్గంలో ప్రధాన లైన్ల వెంబడి చట్ట తొలగింపు రోడ్డు మార్గం ఏర్పాటు చేస్తే సాంకేతిక లోపం ఏర్పడిన గంట వ్యవధిలోనే విద్యుత్ పునరుద్ధరణ చేసే అవకాశం ఉంటుందని విద్యుత్ స్థానిక ఉద్యోగులు అధికారులతో పాటు రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.


Similar News