కుళాయి నీళ్లు తాగాలంటే దుర్వాసన

పెబ్బేరు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గత ఆరు నెలలుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-10-06 11:19 GMT

దిశ పెబ్బేరు: పెబ్బేరు మున్సిపాలిటీలోని ఒకటో వార్డులో గత ఆరు నెలలుగా ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఫిల్టర్ వాటర్ కొనలేక..కుళాయి నీళ్లు తాగాలంటే దుర్వాసన వస్తుందని కాలనీ వాసులు వాపోయారు. మున్సిపాలిటీలోని మోటార్లు కాలిపోయిన పట్టించుకోకుండా శ్రీరంగాపూర్ ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ కానీ నీళ్లనే ప్రజలకు వదులుతున్నరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తే..పొంతన లేని సమాధానాలు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలోని మోటార్లను బాగు చేసి ఒకటో వార్డు ప్రజలకు మంచినీళ్లు అందించాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. 


Similar News