అభివృద్ధి బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం : కృష్ణ మోహన్ రెడ్డి

గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు.

Update: 2023-11-23 17:11 GMT

దిశ, గద్వాల ప్రతినిధి : గద్వాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సమగ్ర అభివృధి జరిగిందని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కృష్ణ మోహన్ రెడ్డి తెలిపారు. గురువారం కేటిదొడ్డి మండల కేంద్రంలో కేటిదొడ్డి మండల నాయకులు, కార్యకర్తలతో బూత్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతిఇంటికీ వెళ్లి ఓటర్లను కలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన మ్యానిఫెస్టోను వివరించి, కారు గుర్తుకు ఓటేయాలని కోరాలని సూచించారు.

గతంలో కేటిదొడ్డి మండలం కరువు కాటకాలకు నిలయంగా వుండేదని, నేడు కేటిదొడ్డి మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతూ అన్ని రంగాలలో కేటిదొడ్డి మండలం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుందన్నారు. నవంబర్ 30 తేదీ నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకీ మద్దతు తెలుపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ఎన్నికల ఇంచార్జ్ రాకేష్, జడ్పీటీసీ రాజశేఖర్, మండలం పార్టీ అధ్యక్షులు ఉరుకుందు, రైతు బంధు సమితి అధ్యక్షుడు హనుమంతు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భగవంతుడు, వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చక్రధర్ రావు, శేఖర్ రెడ్డి, రాజేష్, యుగంధర్ గౌడ్, తిమ్మారెడ్డి గోపాల్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News