అక్రమ కట్టడాన్ని కూల్చివేసిన ఊరి జనం
మహమ్మదాబాద్ మండల కేంద్రంలో పశువుల వైద్యశాల ఆవరణలో ఆక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని...Demolition of illegal constructions
దిశ, మహమ్మదాబాద్: మహమ్మదాబాద్ మండల కేంద్రంలో పశువుల వైద్యశాల ఆవరణలో ఆక్రమంగా నిర్మిస్తున్న కట్టడాన్ని కూల్చివేశారు. వివరాల్లోకి వెళితే, గ్రామ కంఠంలో గల పశువైద్యశాల ఆవరణలో ఖాళీ స్థలం తమదిగా భావించి ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తున్న కట్టడానికి గ్రామపంచాయతీ అనుమతులు లేవంటూ, అలాగే ఆ స్థలం పూర్తిగా గ్రామ కంఠంలోని గ్రామానికి చెందినది అని ఒకసారి గ్రామ కంఠానికి కేటాయించబడిన భూమి తిరిగి ప్రైవేట్ వ్యక్తులపై వ్యవసాయ పొలంగా మార్పు జరగడం అనేది నిబంధనలకు విరుద్ధం అని, దాంతో మేల్కొన్న గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారంతో కట్టడాన్ని కూల్చివేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పార్వతమ్మ రాజేశ్వర్ మాట్లాడుతూ, ప్రస్తుతము పశువైద్యశాలలో నిర్మిస్తున్న కట్టడం గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని, అలాగే ప్రైవేట్ వ్యక్తులకు చెందిన స్థలం కాదని, అయినా గ్రామ కంఠంలోని స్థలం మూగజీవాల అవసరాల కోసం కేటాయించబడిందని, ప్రైవేటు వ్యక్తి తాము దానిని దానంగా ఇచ్చామంటూనే తిరిగి ఆక్రమించుకోవాలనుకోవడం సరికాదన్నారు.