తుంగభద్ర నది తీరాన మొసలి కలకలం..

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం జిల్లెల పాడు గ్రామ

Update: 2024-11-11 04:47 GMT

దిశ, అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండలం జిల్లెల పాడు గ్రామ సమీపంలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున ఉదయం మొసలి కలకలం రేపింది. జిల్లాల పాడు మేకల కాపరుడు శివ నాయుడు మేకలను అటుగా తీసుకుని వెళుతుండగా నది ఒడ్డున మొసలి కనిపించిందని తెలిపారు. తుంగభద్ర నది తీరాన వడ్డుపై ముసలి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందించారు. అటువైపు వెళ్లవద్దని, మత్స్యకారులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలి అధికారులు హెచ్చరించారు. మొసలిని పట్టుకుంటామని.. కాస్త జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.


Similar News