Sunkesula Dam: సుంకేసుల డ్యాం నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండుకుంది.

Update: 2024-07-27 05:27 GMT

దిశ, రాజోలి: ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా సుంకేసుల బ్యారేజీ పూర్తిస్థాయిలో నిండుకుంది. ప్రస్తుతం.. 82,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో డ్యాం నుంచి శనివారం 20 గేట్లు తెరిచి 73,680 క్యూసెక్కుల నీటిని దిగువకు తరలిస్తున్నట్టు డ్యామ్ అధికారులు తెలిపారు. ప్రస్తుతం డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 1.235 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం.. 0.507 టీఎంసీ నీటి నిల్వ కొనసాగుతున్నట్టు తెలిపారు. కేసీ కెనాల్ ద్వారా 1540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు డ్యాం అధికారులు తెలిపారు.


Similar News