అమిత్ షా వ్యాఖ్యలపై పేటలో కాంగ్రెస్ నిరసన
నారాయణపేట జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
దిశ, నారాయణపేట ప్రతినిధి: నారాయణపేట జిల్లా కేంద్రంలో కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను పార్లమెంట్ ఉభయసభలో కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ బదులు దేవుడు జపం చేసిన పుణ్యం వచ్చేదని వ్యంగ్యంగా అవమానించడం హేమమైన చర్యగా తీసుకొని, అమిత్ షాను కేంద్ర మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి..అమిత్ షా చిత్రపటాన్ని దగ్ధం చేశారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ వెళ్లి కలెక్టర్ సిక్త పట్నాయక్ కు వినతి పత్రం అందించారు. డీసీసీ జిల్లా అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ గందే అనసూయ చంద్రకాంత్, వైస్ చైర్మన్ హరి నారాయణ బట్టడ్, మార్కెట్ చైర్మన్ సదాశివరెడ్డి, వైస్ చైర్మన్ కోనం గేరీ హనుమంతు, మాజీ మార్కెట్ చైర్మన్ బండి వేణుగోపాల్, ధన్వాడ మండల అధ్యక్షులు నరహరి, పేట తొమ్మిదవ వార్డ్ కౌన్సిలర్ యు. మహేష్ , కాంగ్రెస్ యువ నాయకులు వెంకటేష్ గౌడ్, మాజిద్ తదితరులు పాల్గొన్నారు.