‘మనఊరు మనబడి’ పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ కోయ శ్రీ హర్ష

మనఊరు మనబడి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు.

Update: 2023-02-25 16:17 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: మనఊరు మనబడి పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫెరెన్స్ హాల్ లో పంచాయతీ రాజ్ అధికారులతో మనఊరు మనబడిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతలో ఎంపిక చేసిన 174 పాఠశాలల్లో ఇప్పటివరకు 98 శాతం పనులు పూర్తికావడం జరిగిందన్నారు. కొన్ని పాఠశాలల్లో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణ పనులు, ఫ్లోరింగ్ పనులు చేయాల్సి ఉన్నాయని వాటిని త్వరగా పుర్తిచేయలన్నారు. అభివృద్ధి పనులకు ఎక్కడా ఇసుక కొరత లేదని, కాబట్టి పనులు మార్చి మొదటి వారం వరకు పుర్తిచేయలన్నారు.

మండలాల వారిగా పనుల వివరాలను ఏఈల ద్వారా అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి అయిన వారికి ఇప్పటివరకు డబ్బులను చెల్లించడం జరిగిందని, పనులు పూర్తి అయి ఇంకా ఎవరికైనా డబ్బులు రాకపోతే తన దృష్టికి తీసుకరావలన్నారు. ఈ సమావేశంలో లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయంక్ మిత్తల్, పంచాయతీ రాజ్ ఈఈ నరేందర్, డీపీఓ మురళి, బాబురావు తదితరులు  పాల్గొన్నారు.

Tags:    

Similar News