ఏనుగు తలకాయతో పుట్టిన గేదె..చివరికి ఏమైందంటే..?
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, గంగారం గ్రామంలో ఓ వింత జరిగింది
దిశ, బిజినేపల్లి : నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం, గంగారం గ్రామంలో ఓ వింత జరిగింది. మంగళవారం సాయంత్రం మల్లెపల్లి అంజన్ రెడ్డి గేదెకు రెండవ సంతానమైన ఏనుగు రూపంలో దూడ జన్మించింది. దీంతో గ్రామంలోని ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఒక గంట సేపు తర్వాత ఏనుగు రూపంలో ఉన్న దూడ మరణించడంతో..యజమాని శోకసముద్రంలో మునిగిపోయారు.