ప్రసాద్ పథకం పనులు త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్ వల్లూరు క్రాంతి

ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ లో ప్రసాద్ పథకం ద్వారా జరిగే అభివృద్ధి పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Update: 2023-03-25 12:06 GMT

దిశ, అలంపూర్ టౌన్: ఐదవ శక్తిపీఠం ఆలంపూర్ లో ప్రసాద్ పథకం ద్వారా జరిగే అభివృద్ధి పనులు త్వరితిగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శనివారం అలంపూర్ ఆలయాల సమీపంలో జరుగుతున్న ప్రసాద్ స్కీం అభివృద్ధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ మేరకు ఆమె ముందుగా నవబ్రహ్మ ఆలయాల దగ్గర ప్రసాద్ స్కీం కింద చేపట్టాల్సిన ప్రహరీ నిర్మాణానికి ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ స్థలం దగ్గర నుంచి సమీపంలోని గ్రామ కంఠంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు.నవబ్రహ్మాలయాల పార్కింగ్ స్థలంలో భక్తులు సేద తీరేందుకు పబ్లిక్ ఎమినిటీ సెంటర్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇప్పించాలంటూ ఆలయ ఈఓ పురంధర్ కుమార్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.

వెంటనే సంబంధిత ఆర్కియాలజికల్ అసిస్టెంట్ సూపరిటెండెంట్ రోహిణితో మాట్లాడగా దేవస్థానంకు సంబంధించి సంబంధిత పురాతత్వ శాఖ వారికి లేఖ రాసి డైరెక్టర్ జనరల్ తో అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందంటూ సమాధానం ఇచ్చారు. అనంతరం పార్కింగ్ టైల్స్, ఐమాస్టు లైట్స్ ఏర్పాటుకు వస్తున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పర్యాటక ప్రదర్శనశాలను కలెక్టర్ సందర్శించి అక్కడి విగ్రహాన్ని తిలకించారు. అన్నదాన సత్రం స్థల పరిశీలన, దేవాలయ మ్యూజియం పరిశీలన, అప్రోచ్ రోడ్డుకు సంబంధించి ఆక్రమణకు గురైన నివాస స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం రూ. 20 కోట్ల నిధులతో నిర్మిస్తున్న మూడంతస్తుల భవనాన్ని పరిశీలించారు. వివరాలను సంబంధిత పర్యాటకశాఖ డీఈ ధనరాజ్ కలెక్టర్ కు వివరించారు. ఆ తరువాత స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. హేమలపురం సదన్ లో దేవాదాయ శాఖ, మునిసిపల్, కేంద్ర పురాతత్వ శాఖ, పర్యాటక శాఖ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా శాఖల వారీగా నెలకొన్న ఇబ్బందులు సమస్యల పరిష్కార మార్గాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఈఓ పురంధర్ కుమార్, ఇరిగేషన్ ఈఈ విజయ్ కుమార్ రెడ్డి, పర్యాటకశాఖ డీఈ ధనరాజ్. కేంద్ర పురాతత్వ శాఖ రాష్ట్ర అసిస్టెంట్ సూపర్డెంట్ రోహిణి, ఏఈ శరవణన్ మున్సిపల్ కమిషనర్ నిత్యానందం, ఇంచార్జి తహసీల్దార్ సుభాష్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News