ఇద్దరు అంగన్వాడీ టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్

అంగన్వాడి కేంద్రంలో అనుమతి లేకుండా 1, 2 టీచర్లు విధులకు గైర్హాహాజరైన ఇద్దరు అంగన్వాడీ టీచర్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సస్పెండ్ చేశారు.

Update: 2023-02-16 14:17 GMT

దిశ, వనపర్తి: అంగన్వాడి కేంద్రంలో అనుమతి లేకుండా 1, 2 టీచర్లు విధులకు గైర్హాహాజరైన ఇద్దరు అంగన్వాడీ టీచర్లను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్ సస్పెండ్ చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. గురువారం వనపర్తి జిల్లా పాన్ గల్ మండల కేంద్రంలోని పాన్ గల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, అంగన్వాడి కేంద్రాలను, ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దస్త్రాలు పరిశీలించారు. రోగులకు అందిస్తున్న సేవల గురించి డాక్టర్ హరినాథ్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.

మండల కేంద్రంలోని అంగన్వాడి 1,2,కేంద్రాలను సందర్శించిన సమయంలో టీచర్లు లేకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ, శంకరమ్మ అంగన్వాడి టీచర్లు అందుబాటులో లేకపోవడంతో కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. పానగల్ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడారు. పాఠశాల వరండాలో ఉపాధ్యాయులకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు పెట్టడాన్ని తప్పుబట్టారు. పదవ తరగతి విద్యార్థులతో వార్షిక పరీక్షల సన్నద్ధంపై చర్చించారు.

ప్రణాళిక బద్ధంగా చదివి ప్రశాంతతతో పరీక్షలు రాయాలని సూచించారు. స్కూల్ లో దాదాపు 100 మంది ఆబ్సెంట్ కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసీల్దార్ యేసయ్య, ఎంపీడీఓ నాగేశ్వర్ రెడ్డి, ఎంపీఓ రఘురాముడు, ఏఈ సత్య తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News