ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్..

Update: 2023-03-16 11:29 GMT

దిశ, ప్రతినిధి నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ శ్రీ హర్ష గురువారం తనిఖీ చేశారు. కాగా, ఇంటర్ ద్వితీయ సంవత్సరం లాంగ్వేజ్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 3,967 మంది హాజరు కావలసి ఉండగా 3,869 మంది హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా 98 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.53 గా ఉంది. ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదు.

Tags:    

Similar News