‘పది’ పరీక్షా కేంద్రాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..

నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఆయా మండలా పరిధిలోని పది పరీక్షా కేంద్రాలలో గురువారం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

Update: 2023-04-06 10:03 GMT

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని ఆయా మండలా పరిధిలోని పది పరీక్షా కేంద్రాలలో గురువారం జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అమ్రాబాద్ మండల పరిధి మన్ననూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశా, కల్వకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, నిర్మల విద్యాలయం పాఠశాలలను సందర్శించి విద్యార్థులు ఆంగ్ల పేపర్ పరీక్షా రాసే విధానం, సరళిని పరిశీలించారు. పరీక్షకు హాజరైన విద్యార్థుల వివరాలను జిల్లా కలెక్టర్ చీఫ్ సూపరింటెండెంట్ లను అడిగి తెలుసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా పర్యవేక్షించాలని ఇన్‌విజిలెటర్స్ ను ఆదేశించారు.

విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్షా హాల్ లో నిరంతర విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు, ఉండాలని, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్‌ లను అనుమతించరాదని, సమీపంలో ఎటువంటి జీరాక్స్‌ సెంటర్లు ఉండరాదని, 144 సెక్షన్‌ పటిష్టంగా అమలు చేయాలని సంబంధిత పోలీసు అధికారులకు కలెక్టర్‌ సూచించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓ గోవిందరాజులు, తహసీల్దార్లు రాంరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, నోడల్ అధికారి కుర్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News