వంకేశ్వరంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ
నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలంలోని వంకేశ్వరం గ్రామంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్యన తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది.
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా పదరా మండలంలోని వంకేశ్వరం గ్రామంలో ఇరు పార్టీలకు చెందిన కార్యకర్తల మధ్యన తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. అలాగే అమ్రాబాద్ మండల కేంద్రంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద కార్యకర్తలు అత్యుత్సాహం కనబరచిన విషయాన్ని గమనించిన పోలీసులు వారి పై లాఠి ఝులిపించారు. శాంతియుత వాతావరణంలో ఓటింగ్ నిర్వహించుకునేందుకు పోలీసులు తమ చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం మన్ననూరు గ్రామంలో ఘర్షణతో పాటు పలుచోట్ల స్వల్ప ఘర్షణలు చేసుకోవడంతో పోలీసులు మరింత పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేసే పనిలో నిమగ్నమైనారు.