'ఆశా'లకు కనీస వేతనం వర్తింపజేయాలి: సీఐటీయూ
ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు కనీస....CITU Protest at Mahaboobnagar
దిశ, మహబూబ్ నగర్: ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు కనీస వేతనం 26 వేల రూపాయలకు పెంచాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కురుమూర్తి డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన 48 గంటల వంటా వార్పు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు వైద్య సేవలందిస్తూ, తమ ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అధికారుల వేధింపులను భరిస్తూ వెట్టి చాకిరి చేస్తున్న ఆశా వర్కర్లకు రూ. 3 నుండి 6 వేల వరకు వేతనాలను చెల్లిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నారని ఆయన తీవ్రంగా విమర్మించారు. ప్రభుత్వం వెంటనే చట్ట ప్రకారం 26 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దీప్లా నాయక్, చంద్రకాంత్, తిరుమలయ్య, సత్తయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు సాధన, సావిత్రి, అలివేలు, రాజ్యలక్ష్మి తదితరలు పాల్గొన్నారు.