కాళేశ్వరం అవినీతిపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి : డీకే అరుణ

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతి పై సీబీఐ ఎంక్వైరీ

Update: 2024-01-10 15:24 GMT

దిశ,జడ్చర్ల : రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం అవినీతి పై సీబీఐ ఎంక్వైరీ వెయ్యాలని, కాలయాపనకే జ్యూడిషల్ ఎంక్వయిరీ అంటూ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కాలయాపన చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. బీఆర్ఎస్ అవినీతిని ఎండగట్టేందుకు రాష్ట్రంలో ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని, కాళేశ్వరం తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మొత్తం అవినీతిపైన సీబీఐ విచారణ చేపట్టాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. బుధవారం జడ్చర్ల లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని పొందాలి. ఈ సందర్భంగా ఆమెకు అయ్యప్ప గురు స్వాములు వేద మంత్రోచ్ఛారానతో ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు టిఆర్ఎస్ పార్టీ పై అవాక్కు చవాకులు పేల్చుతున్నారు తప్ప వాటిని కార్యచరణకు ముందుకు సాగడం లేదని అన్నారు గత పది నెలలు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేక పథకాల్లో ప్రాజెక్టుల్లో అవకతవకలకు పాల్పడిందని ఎన్నికల్లో గొంతు చించుకుంటూ చెప్పిన కాంగ్రెస్ నాయకులు వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ అవినీతిపై సిపిఐ ఎంక్వయిరీ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు ఓటేసిన లాభం లేదని, దేశంలో మరోమారు బీజేపీ గెలిచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం బీజేపీకే ఓటెయ్యాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు సాహితీ రెడ్డి విష్ణు మధు అయ్యప్ప స్వాములు సాయి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News