పోలింగ్ కేంద్రాల సమీపంలో చిన్నారుల ప్రచారం
విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో చిన్నారులు పోలింగ్ కేంద్రాల సమీపంలో పార్టీల కరపత్రాలు పట్టుకుని పలాన వ్యక్తికి ఓటు వేయమని కోరుతున్నారు.
దిశ, వీపనగండ్ల : విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వడంతో చిన్నారులు పోలింగ్ కేంద్రాల సమీపంలో పార్టీల కరపత్రాలు పట్టుకుని పలాన వ్యక్తికి ఓటు వేయమని కోరుతున్నారు. మండల కేంద్రమైన వీపనగండ్ల పోలింగ్ కేంద్ర సమీపంలో పలువురు చిన్నారులు కరపత్రాలు పట్టుకొని కారు గుర్తుకు ఓటు వేయాలని పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి వెళుతున్న ఓటర్లకు సూచిస్తున్నారు. చిన్నారులు కరపత్రాలు పట్టుకుని ఓటు వేయాలని ఓటరుని అభ్యర్థిస్తున్న దృశ్యాలను అధికారులు ప్రత్యక్షంగా చూస్తున్నా తమకు ఏమి పట్టనట్లుగా చూసి చూడక వెళుతున్నారు.