బీఆర్ఎస్ ఓటమి ఎజెండా పనిచేయాలి.. తుడీ మేఘా రెడ్డి
కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బేషజాలాలకు పోకుండా సమిష్టిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటమే ఎజెండా పని చేయాలనీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడీ మేఘా రెడ్డి పిలుపునిచ్చారు.
దిశ, వనపర్తి : కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బేషజాలాలకు పోకుండా సమిష్టిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓటమే ఎజెండా పని చేయాలనీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తుడీ మేఘా రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం ఒంటరి జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్యథి దులుగా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ పరిశీలకులు లక్ష్మి మంజుల,చంద్రశేఖర్ రెడ్డి, సునీత, ఎమ్మెల్యే అభ్యర్థి తుడీ మేఘా రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి నేతృత్వంలో క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి సహకారంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా కల్పించిన అవకాశం ను సద్వినియోగం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుని వచ్చేలా నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలన్నారు. 20 రోజులు గెలుపు కోసం పనిచేస్తే ఐదు సంవత్సరాలు జీతగాడిగా మీకు సేవలందిస్తానన్నారు.
20 రోజుల సమయం లో గ్రామాలలో గడప,గడపకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారెంటీ కార్డు అంశాలను అధికారంలోకి వచ్చిన వంద రోజులలో అమలు చేస్తామన్న నమ్మకం కల్పించాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి తుడి మేఘా రెడ్డి సమక్షంలో వనపర్తి నియోజకవర్గ పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు అక్కి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పాలు గ్రామాల నుంచి 430 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నవంబర్ 10వ తేదీన నామినేషన్ కార్యక్రమానికి కార్యకర్తలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమం లో కార్యక్రమంలో వనపర్తి ఎంపీపీ కిచ్చారెడ్డి, మాజీ జెడ్పీటీసీలు టి రవీందర్ రెడ్డి, రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ క్యామ వెంకటయ్య, రమణ, సర్పంచులు రాధాకృష్ణ జయంతి సతీష్, వెంకటస్వామి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ బ్రహ్మచారి, షకీల్ జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు, కేశవులు జిల్లా కాంగ్రెస్ జర్నల్ సెక్రెటరీ, మాజీ సర్పంచులు సత్యశీల రెడ్డి, సురేష్, మాజీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.