కేవలం ఒక్క కాల్లో బ్యాంకింగ్ సేవలు..

మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్ కుమార్ గురువారం బ్యాంకు ఖాతాదారులకు కొత్త టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఇంటి దగ్గరే నుండి బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చును.

Update: 2024-11-21 05:35 GMT

దిశ, మహమ్మదాబాద్ : మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ రాజేష్ కుమార్ గురువారం బ్యాంకు ఖాతాదారులకు కొత్త టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా ఇంటి దగ్గరే నుండి బ్యాంకింగ్ సేవలను వినియోగించుకోవచ్చును. ఈ నెంబర్లకు కాల్ చేసి అకౌంట్ నెంబర్ చివరి నాలుగు అంకెలను జోడిస్తే మన అకౌంటులో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుస్తుంది. ఏటీఎం కార్డు దొంగిలించినా, పోయినా ఏటీఎం కార్డు పిన్ నెంబర్ జనరేట్ చేసుకోవాలనుకున్న, మార్చుకోవాలనుకున్న రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి స‌బ్ బ్లాక్ XXXX అని 567676కి ఎస్ఎంఎస్ పంపించాల్సి ఉంటుంది. ఇక్క‌డ XXXX అనేది కార్డ్ నంబర్‌లోని చివరి 4 అంకెలను సూచిస్తుంది. ఫోన్ ద్వారా చేసుకోవచ్చని వినియోదారులకు అవగాహన కల్పించారు.

టోల్ ఫ్రీ నం : 1800 1234

1800 2100 లభిస్తున్న సేవలు

1. బ్యాలెన్స్ విచారణ, ఆఖరి 5 లావాదేవీలు

2. అకౌంట్ స్టేట్మెంట్

3. ఏటీఎం పిన్ జెనరేట్ చేయండి / మార్చండి

4. ఏటీఎం కార్డు బ్లాక్ / పునఃజారీ / డిశ్పాచ్ స్టేటస్

5. హోమ్ /ఎడ్యుకేషన్ లోన్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్

6. డిపాజిట్ ఇంటరెస్ట్ సర్టిఫికెట్ / టీడీఎస్ వివరాలు

7. సీఐఎఫ్, హోమ్ బ్రాంచ్ సమాచారం

8. యోనో/ఐఎన్బీ సంబంధ సందేహాలు

9. చెక్కు బుక్ జారీ/స్టాప్ చెక్

10. ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడీ/యుపీఐ ఐడి బ్లాకింగ్

11. డిపాజిట్, లోన్ ప్రోడక్ట్ల విశిష్టతలు, మరెన్నో సర్వీసులు... బ్యాంకు ద్వారా లభిస్తాయని బ్యాంకు ఖాతాదారులకు తెలియజేశారు.


Similar News