'కుళ్ళిన గుడ్లు, ఉడకని అన్నం వల్లనే పుడ్ పాయిజన్..'

కుళ్ళిన గుడ్లు, ఉడకని అన్నం విద్యార్థులు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ సంభవించిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మీడియా ముందు చెప్పారు.

Update: 2024-11-21 07:05 GMT

దిశ, మక్తల్ : కుళ్ళిన గుడ్లు, ఉడకని అన్నం విద్యార్థులు తినడం వల్లనే ఫుడ్ పాయిజన్ సంభవించిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మీడియా ముందు చెప్పారు. గురువారం నియోజకవర్గంలోని స్కూల్ ను సిక్తా పట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని అధికారులు వైద్య సిబ్బంది స్పందించడం వల్లనే 16 మంది విద్యార్థులకు ఎవరికి ప్రాణహాని లేకుండా మెరుగైన చికిత్సతో విద్యార్థులందరూ కోలుకుంటున్నారని ఆమె అన్నారు.

జరిగిన సంఘటన పై తాను ఏజెన్సీలు, సిబ్బంది, పేరెంట్స్, విద్యార్థుల ద్వారా ఆరా తీయగా నిర్లక్ష్యం చాలా ఉందని, గతంలో రెండు మూడు సార్లు ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఇబ్బంది పడ్డారని, విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. వంట ఏజెన్సీని మారుస్తున్నామని మధ్యాహ్న భోజనాన్ని వండి, వడ్డించే సమయంలో పాఠశాల అధికారుల పర్యవేక్షణ లేక పోవడం వల్లే ఈ సంఘటన జరిగిందని అన్నారు. ఇక ముందు ఇలాంటి సంఘటన జరగకుండా అధికారులు జాగ్రత్తలు పాటించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి అబ్దుల్ గని, ఆర్డీఓ రాంచందర్, స్థానిక తహశీల్దార్ సురేష్ కుమార్, సిబ్బంది అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.


Similar News