బంగ్లాదేశ్ హిందువులకు రక్షణ కల్పించాలని.. గద్వాల పట్టణం బంద్
బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాల పై దాడులను నిరసిస్తూ గద్వాల హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గద్వాల పట్టణంలో బంద్ నిర్వహించారు.
దిశ, గద్వాల ప్రతినిధి: బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందువులపై, హిందూ దేవాలయాల పై దాడులను నిరసిస్తూ గద్వాల హిందూ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం గద్వాల పట్టణంలో బంద్ నిర్వహించారు. హిందూ సంఘాల కార్యకర్తలు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీ నేతలు, ధార్మిక సంస్థ కార్యకర్తలు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గద్వాల్ లోని సోమనాద్రి కోట నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా కాషాయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.అనంతరం కృష్ణవేణి చౌరస్తాలో మానవహారం నిర్వహించి బంగ్లాదేశ్‌లోజరిగే హిందు వులపై జరుగుతున్న దాడులను ముక్తకంఠంతో నేతలు ఖండించారు.
అనంతరం జరిగిన సభలో వివిధ వర్గాల ప్రతినిధులు మాట్లాడుతూ.. బంగ్లాదేశ్ కేవలం హిందువుల ఇళ్ల పై, దేవాలయాల పై, మహిళల పై దాడులు చేస్తున్నారని, మైనారిటీలుగా వున్నా హిందువాలా పై దాడులను అక్కడున్న ప్రభుత్వం అడ్డుకట్ట వేయలేకపోతుందని విమర్శించారు. కేంద్రం వెంటనే ఆ దేశం తో దౌత్య నీతి జరపాలని కోరారు. ప్రపంచంలోని అంతర్జాతీయ సంస్థలు, మానవ హక్కుల సంఘాలు, సంస్థలు హిందువులపై జరిగే మరణాహోమన్ని అరికట్టేవిధంగా బాంగ్లాదేశ్ పై ఒత్తిడి పెంచాలని నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్, భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్, రెడ్డి కుల సంఘం, వాల్మీకి కుల సంఘం, ఆర్య వైశ్య సంఘం, బ్రాహ్మణ సంఘం, పలు రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు.