మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం.. చెట్ల పొదల్లో నవజాత శిశువు లభ్యం

అప్పుడే పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కనికరం లేకుండా చెట్ల పొదల్లో వదిలిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది.

Update: 2024-09-11 07:48 GMT

దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే పుట్టిన నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కనికరం లేకుండా చెట్ల పొదల్లో వదిలిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దేవరకద్ర మండలం, డోకూరు గ్రామ స్టేజి దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లారు. ఈ క్రమంలోనే దేవరకద్ర పీఏసీఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి తన సొంత గ్రామానికి వెళ్తుండగా పాప ఏడుపు వినపడింది. దీంతో అప్రమత్తమైన ఆయన పాప ఉన్న ప్రాంతానికి వెళ్లి చూడగా చీమలు పట్టి ఉండటం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి దేవరకద్ర ఎస్సై నాగన్న, అంగన్‌వాడీ టీచర్ విజయలక్ష్మి చేరుకుని నవజాత శిశువును చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వైద్యం అందజేశారు. అనంతరం శిశువును ఐసీడీఎస్ అధికారులకు అప్పగించారు.


Similar News