Cm tour : సీఎం పర్యటనకు పటిష్ట పోలీసు బందోబస్తు
నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy ) పర్యటించనున్నారు
దిశ,మద్దూర్ : నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy ) పర్యటించనున్నారు. దీంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని ఎస్పీ శ్రీ యోగేష్ గౌతమ్ తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా మద్దూర్ లోని షా గార్డెన్ ఫంక్షన్ హాల్లో జిల్లా పోర్స్, ఉమ్మడి జిల్లా నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఎస్పీ భద్రతారమైన సూచనలు ఇచ్చారు. టీయస్ పీసి ప్లాటున్స్, స్పెషల్ పోర్స్, రోప్ పార్టీలు, బీడీ టీమ్స్, ఆర్ఓపి పార్టీలు మొత్తం 350 మంది పోలీసు అధికారులు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. మద్దూర్ లో ఏలిప్యాడ్ నుంచి మండల కాంగ్రెస్ నేత కల్లపు సతీష్ ఇంటి వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బందోబస్తుకి వచ్చినప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండి.. అక్కడ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. పోలీసు బందోబస్తును మొత్తం 08 సెక్టార్లుగా విభజించి..డీయస్ పీలు ఇంచార్జీ లుగా బారి బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా రూప్ టాప్ సెంట్రీలో ఉన్న పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Cm revanth Reddy ) పర్యటన సందర్భంగా..పోలీస్ అధికారులు సిబ్బంది తమకు కేటాయించిన..ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండి పక్కాగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ తెలిపారు. అనంతరం ఎలి ప్యాడ్ నుంచి మద్దూరు టౌన్ వరకు కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ లు రాములు, రియాజ్, డీఎస్పీ లు సిఐ లు, ఎస్ఐ లు,పోలీసు సిబ్బంది మొదలగు వారు పాల్గొన్నారు.