టిడిపి అధ్యక్షుడిగా వజ్ర లింగంను నియమించండి
మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా రుద్రంకి వజ్రలింగంను నియమిస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా రుద్రంకి వజ్రలింగంను నియమిస్తే తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు, నాయకులు,అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచే ఆయన ఎన్టీ రామారావుకు,అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,తెలుగుదేశం పార్టీకి వీరాభిమానిగా కొనసాగుతున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులతో,బడుగు బలహీన వర్గాలు,బీసీ,మైనార్టీ,మెజార్టీ,అగ్రవర్ణాల నాయకులతో ఆయన మంచి సత్సంబంధాలు కొనసాగిస్తున్నారన్నారు. ఎవరితోనూ విభేదాలు లేవని,కుల మతాలకు అతీతంగా వ్యవహరించే మనస్తత్వం ఆయనదని,అందరినీ కలుపుకపోయే గుణం కలవాడని పేరుంది. జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన తీవ్రంగా కృషి చేస్తారనే నమ్మకాన్ని పలువురు స్థానికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే నమ్మకం,పట్టుదలతో పని చేయాల్సిన అవసరం ఉందని,పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తాడని టిడిపి శ్రేణులు వ్యాఖ్యానించారు. మహబూబ్ నగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గా వజ్రలింగంకు అవకాశం ఇవ్వాలని టిడిపి అభిమానులు తమ మనోగతాన్ని వ్యక్తం చేస్తున్నారు. టిడిపి పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష నియమాంపక విషయమై ఆలోచించాలని టిడిపి అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.