రాష్ట్రాన్ని క్రీడా హబ్ గా తీర్చిదిద్దుతాం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారని మాజీ ఎంపీ,రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపి జితేందర్ రెడ్డి అన్నారు.

Update: 2024-12-19 13:37 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నారని మాజీ ఎంపీ,రాష్ట్ర అధికార ప్రతినిధి,రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏపి జితేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గా ఎన్నికయ్యాక తొలిసారిగా జిల్లా కేంద్రానికి వచ్చిన సందర్భంగా..ఆయనకు జిల్లా స్టేడియంలో ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడలకు పెద్ద పీట వేశారని,క్రీడల అభివృద్ధికి 370 కోట్ల బడ్జెట్ కేటాయించారని తెలిపారు. ఈ బడ్జెట్ తో రాష్ట్రంలోని అన్ని స్టేడియం లను అభివృద్ధి పరుస్తామని,9.5 ఎకరాలున్న మహబూబ్ నగర్ క్రీడా స్టేడియంను ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందన్నారు.  సీఎం కప్ ను 37 క్రీడలతో నిర్వహిస్తామని,ఇక్కడ అథ్లెటిక్ ట్రాక్ అవసరం ఉందని,ఇతర రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రతి క్రీడాకారుడికి శిక్షణ ఇస్తామని,ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియంను,ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్పీ వెంకటేష్,ఏపి.మిథున్ రెడ్డి తదితర పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.


Similar News