నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయండి..
జిల్లాలో చేపట్టిన నిర్మాణపు పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు.
దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో చేపట్టిన నిర్మాణపు పనులన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ శాఖల ఈఈ లు, డీఈ లతో, టీఎస్ఎంఐడీసీ, ఈడబ్ల్యూఐడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా శాఖల ఇంజనీరింగ్ అధికారులను పనుల పురోగతికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో మంజూరైన వివిధ నిర్మాణపు పనుల పురోగతిని,అసంపూర్తిగా ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈడబ్ల్యూఐడీసీ పరిధిలోగల నిర్మాణపు పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని,ముఖ్యంగా కేజీబీవీ రాజోలీ, బాలసధన్ పూర్తి చేసి, నెలవారీ పురోగతి నివేదికలను అందించాలని ఆదేశించారు. టీఎస్ఎంఐడీసీ అధికారులను మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, క్రిటికల్ కేర్, సబ్ సెంటర్ల అసంపూర్తిగా ఉన్న పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫెడ్.డిఆర్ పనులు, రోడ్ల పనులు, విస్తరణ పనులు, బీటీ రోడ్లు, కనెక్టివిటీ, సీసీ రోడ్లను, భవనాల నిర్మాణపు పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బి శాఖ అధికారులను సూచించారు. గ్రామాల్లో పెండింగ్ పనులను పర్యవేక్షించి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. అన్ని శాఖలు తమ పరిధిలో ఉన్న పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మంజూరు అయినా పనులన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. చేపట్టిన పనులను త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలిస్తానని, పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ కాంతమ్మ, టిఎస్ఎంఐడిసి డి.ఈ శ్రీనివాసులు,ఈ.ఈ పీ.ఆర్ దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈ.ఈ ప్రగతి, ఏఈ లు, ఇంజనీరింగ్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.