లక్ష్మీనారాయణకు కేంద్ర సాహిత్య పురస్కారం పట్ల హర్షం

అభ్యుదయ కవి,కథానికుడు,వ్యాసకర్త,విమర్శకుడు పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించడం పట్ల తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఖాజామోయినోద్ధీన్,కొప్పోలు యాదయ్యలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు

Update: 2024-12-19 12:23 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: అభ్యుదయ కవి,కథానికుడు,వ్యాసకర్త,విమర్శకుడు పెనుగొండ లక్ష్మీనారాయణ కు కేంద్ర సాహిత్య పురస్కారం లభించడం పట్ల తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు ఖాజామోయినోద్ధీన్,కొప్పోలు యాదయ్యలు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. శ్రామిక పక్షపాతిగా రచనలు చేస్తూ,అన్యాయం,దోపిడీ పై తన కలాన్ని,గళాన్ని ఎలుగెత్తి చాటిన గొప్ప కవి లక్ష్మీనారాయణ అని వారు కొనియాడారు. అభ్యుదయ రచయితల సంఘంలో వివిధ పదవులను పోషించి,ప్రస్తుతం ఆయన జాతీయ అధ్యక్షుడు గా సేవలందిస్తున్నారని,ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ కు అభినందనలు తెలిపారు.


Similar News