చోరీ చేసి.. కారంచల్లి వెళ్లిన దొంగలు

ఇంట్లో కారం చల్లి రెండోసారి దుండగులు చోరీకి పాల్పడ్డారు.

Update: 2024-12-19 11:50 GMT

దిశ,పెంట్లవెల్లి: తాళం వేసిన ఇండ్ల లో చోరీ చేసి.. ఆపై ఆధారాలు దొరక్కుండా కారం చల్లి వెళ్లిన ఘటన పెంట్లవెల్లి మండల పరిధిలోని ప్రభుత్వ హాస్పిటల్ పక్కన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెంట్లవెల్లిలో రెండోసారి దొంగతనం చేసి దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకాంబర్ రెడ్డి ఈనెల 11న షాద్ నగర్ కు పని వీుద వెళ్లగా.. గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు. కేజీ వెండి ఎత్తికెళ్లినట్లు కొల్లాపూర్ సిఐ మహేష్ తెలిపారు. అనంతరం పోలీసులకు ఆధారాలు లభించకుండా ఉండేందుకు దుండగులు కారం చల్లి వెళ్లారు. క్లూస్ టీం ద్వారా దర్యాప్తు ముమ్మరం చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో సీసీ కెమెరాలను అమార్చకోవాలని తెలిపారు.


Similar News