మైనర్ బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడు అరెస్ట్
మల్దకల్ మండలం,బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి గత నెల 24వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. గత పది రోజులుగా హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతూ మరణించింది.
దిశ, గద్వాల : మల్దకల్ మండలం,బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి గత నెల 24వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. గత పది రోజులుగా హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతూ మరణించింది. సీడ్ ఆర్గనైజర్ బండ్ల రాజశేఖర్ రెడ్డి ఇంట్లో బంగారు పోయిందని బాలికపై మల్దకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో అవమాన భారంతో పురుగుల మందు తాగి మరణించింది. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిన సీడ్ ఆర్గనైజర్ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించగా తిరస్కరణకు గురైంది. ఈ నేపథ్యంలో ఆ బాలిక ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడైన బండ్ల రాజశేఖర్ రెడ్డిని నేడు పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టుపై గద్వాల సీఐ టంగుటూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత నెలలో మైనర్ బాలిక రాజేశ్వరి ఆత్మహత్యకు కారణమైన ప్రధాన నిందితుడైన రాజశేఖర్ రెడ్డిని నేడు కర్ణాటక రాష్ట్రంలోని రాయచూరు జిల్లాలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నట్లు సిఐ శ్రీనివాస్ తెలిపారు.మల్దకల్ మండలం,బిజ్వారం గ్రామానికి చెందిన మైనర్ బాలిక వడ్డెర రాజేశ్వరి గత నెల 24వ తేదీన పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేయగా.. గత పది రోజులుగా హాస్పిటల్ లో అపస్మారక స్థితిలో చికిత్స పొందుతూ మరణించింది.