ఘోర సంఘటన.. దళిత స్త్రీ పై వేడి నూనె తో దాడి

Update: 2024-10-13 02:05 GMT

దిశ, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా మనపాడు మండలం చిన్న పోతుల పాడు గ్రామంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ నెల 10 వతేది ఒక దళిత మహిళపై సల సల కాగుతున్న నూనెను పోశారు. ఈ ఘటనతో సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వివరాలలోకి వెళితే.. చిన్న పోతుల పాడు గ్రామంలో దళిత ప్రశాంతమ్మ అలియాస్ ఎస్తేరమ్మ w/o రామకృష్ణ చిన్న బండిపై బజ్జిలు వేసుకొని జీవనం సాగించేది. పక్కింటి వారు ప్రశాంతమ్మను ఈ స్థలంలో బజ్జిల బండి పెట్టుకోవద్దని గొడవకు దిగి ఆమేపై వేడి నూనెను చల్లారు. నిందితులు యుగంధర్, సత్తి, అరుణమ్మలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. 10 వ తేదీ సంఘటన జరిగితే ఇంతవరకు నిందితులను అరెస్ట్ చేయకపోవడం విడ్డూరమని గ్రామస్తులు అనుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన దళితులు పెద్ద సంఖ్యలో మానపాడు పోలీస్టేషన్‌కు వెళ్లి ధర్నా చేపట్టారు. CI వచ్చి తగు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ప్రస్తుతం గాయపడిన ప్రశాంతమ్మ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుందని తెలిపారు.

Similar News