భారీగా గంజాయి నూనె పట్టివేత

డ్రగ్స్ తరహాలో మత్తెక్కించే 25 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయి నూనె (హాష్ ఆయిల్ )ను స్టేట్ టాస్క్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం పిస్తా హౌస్ సమీపంలో పట్టుకున్నారు.

Update: 2024-10-03 16:06 GMT

దిశ,మహబూబ్ నగర్: డ్రగ్స్ తరహాలో మత్తెక్కించే 25 లక్షల రూపాయల విలువ చేసే నిషేధిత గంజాయి నూనె (హాష్ ఆయిల్ )ను స్టేట్ టాస్క్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గురువారం పిస్తా హౌస్ సమీపంలో పట్టుకున్నారు. ఒరిస్సా మల్కానిగిరి జిల్లా నుంచి రైయిచూర్ కు బైక్ పై వెళుతున్న ఇద్దురు అంతరాష్ట్ర నిందితులైన నరికేంటమ్ రాయ్,ధర్మేంద్రరాయ్ లు మహబూబ్ నగర్ శివారులో ఆగి అనుమానాస్పదంగా కనిపించారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించగా..ఒరిస్సా నుంచి 25 లక్షల రూపాయల విలువ గల 5 కిలోల హాష్ ఆయిల్ (గంజాయి నూనె) ను కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్టీఎఫ్సీ టీం డిఎస్పీ తులా శ్రీనివాసరావు తెలిపారు. 


Similar News