ప్రైవేట్ నర్సు అదృశ్యం

వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ నర్సు అదృశ్యమైంది.

Update: 2024-10-03 15:29 GMT

దిశ, నవాబుపేట : వికారాబాద్ జిల్లాలో ఓ ప్రైవేట్ నర్సు అదృశ్యమైంది. చౌడాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న.. నవాబుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మరికల్ గ్రామానికి చెందిన భాను అనే 22 సంవత్సరాల వివాహిత యువతి గత నెల 29వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆమె భర్త బజారి శివ గురువారం నవాబుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ గ్రామానికి చెందిన భానును ప్రేమించిన శివ ఆమెను వివాహం చేసుకున్నాడు. శివ గ్రామంలో టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవిస్తుండగా..భాను చౌడాపూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ క్లినిక్ లో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. కొంతకాలం పాటు వారు అన్యోన్యంగా తమ దాంపత్య జీవితం గడిపారు. గత నెల 26వ తేది తనకు హైదరాబాద్ పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉద్యోగం కొరకు ఇంటర్వ్యూ ఉందని, ఇంటర్వ్యూకు అటెండ్ కావడానికి హైదరాబాద్ కు వెళ్తానని భాను తన భర్త శివతో తెలుపగా ఇప్పుడు వద్దు, దసరా పండుగ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దామని శివ చెప్పాడు. దీంతో భాను ఒప్పుకోలేదు. ఈ విషయంలో వారిద్దరికీ మధ్య గొడవ జరిగింది. గత నెల 29వ తేదీ ఉదయం 10 గంటలకు ఇంట్లో ఎవరు లేని సమయంలో భాను ఎవరికీ చెప్పకుండా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఇంట్లో నుండి వెళ్లిపోయింది. ఆమె కోసం చుట్టుపక్కల ఇళ్లల్లో, తమ బంధువుల ఇళ్లల్లో వెతికిన ఆమె ఆచూకీ ఎక్కడ కూడా లభించకపోవడంతో..గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అదృశ్యమైన యువతి భాను భర్త శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై విక్రం తెలిపారు.


Similar News