Srisailam reservoir : శ్రీశైలం ప్రాజెక్టుకు ఏమాత్రం తగ్గని వరద
కర్ణాటక రాష్ట్రంలో భారీగా వర్షం కురుస్తున్న కారణంగా గత వారం రోజులుగా ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం గా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు కు 3 లక్షలకు పైగా వరద వచ్చి చేరుతుంది.
దిశ, అచ్చంపేట : కర్ణాటక రాష్ట్రంలో భారీగా వర్షం కురుస్తున్న కారణంగా గత వారం రోజులుగా ఎగువన జూరాల ప్రాజెక్టు నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ఉగ్రరూపం గా వచ్చి శ్రీశైలం ప్రాజెక్టు కు 3 లక్షలకు పైగా వరద వచ్చి చేరుతుంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టు అధికారులు ఎప్పటికి అప్పుడు వరద జలాలను అంచనా వేస్తూ శుక్రవారం కూడా ప్రాజెక్టు 10 గేట్లు 10 అడుగులు పైకి ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని వదులు వదులుతున్నారు.
ప్రాజెక్టుకు ఇన్ఫ్లో..
వేగంగా ఎగువనున్న ఆల్మట్టి డ్యామ్, జూరాల ప్రాజెక్టుల నుంచి కృష్ణమ్మ ఉరకలేస్తూ శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చి చేరుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు 885 అడుగులు, 215. 807 టీఎంసీల సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 884.70 అడుగులకు చేరుకోగా, 213.88 టీఎంసీల సామర్థ్యానికి చేరుకుంది. జూరాల ప్రాజెక్టు 2.84 లక్షలకు పైగా క్యూసెక్కులు, జూరాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా 19, 516 వేల క్యూసెక్కుల మొత్తం వరద జలాలు 3,04, 150 లక్షల క్యూసెక్కుల చేరుకుంది. ఈ క్రమంలో శ్రీశైలం ప్రాజెక్టుకు 2.93,281 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా ప్రాజెక్టు 10 క్రస్ట్ గేట్లను పది అడుగుల మేర పైకి ఎత్తి దిగివల నాగార్జునసాగర్ ప్రాజెక్టు కు 2,79, 370 క్యూసెక్కులు అలాగే తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 37,882 వేల క్యూసెక్కులు ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 30,925 వేల క్యూసెక్కులు మొత్తంగా 3.40 లక్షల క్యూసెక్కుల వరద నాగార్జునసాగర్ ప్రాజెక్టు వైపు ఉరకలేస్తుంది.
ఎగువ నుండి మరింత వరద నిరంతరాయంగా కొనసాగితే అధికారులు గేట్లును మరింత పైకి ఎత్తేందుకు అప్రమత్తంగా ఉన్నారు. తెలంగాణ ఏపీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉన్నదనీ, శ్రీశైలం ప్రాజెక్టు తెలంగాణ ఎడమ గట్టు సొరంగ విద్యుత్ కేంద్రంలో ఐదు యూనిట్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూనే ఉందని టీజీ జెన్కో సి ఈ సూర్యనారాయణ దిశకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ ఏడాది ప్రభుత్వం హైడల్ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి టార్గెట్లు తప్పక అధికమిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.