park : పడకేసిన 'స్వచ్చదనం-పచ్చదనం'
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమం పట్టణంలోని పలు పార్కుల్లో శుచి, శుభ్రత కరువై అధ్వాన్న స్థితిలో ఉన్నవి.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వచ్ఛదనం-పచ్చదనం' కార్యక్రమం పట్టణంలోని పలు పార్కుల్లో శుచి, శుభ్రత కరువై అధ్వాన్న స్థితిలో ఉన్నవి. స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్ వెనుక ఆనుకొని ఉన్న 2 ఎకరాల విస్తీర్ణంలో 2021 లో కోటి 50 లక్షల రూపాయలతో పెద్ద పార్కును పూల మొక్కలు, పిల్లలు ఆడుకునే పరికరాలు, రెండు విభాగాల్లో జిమ్ లతో ప్రారంభించారు. అప్పటి నుంచి నేటి వరకు పార్కు ఆలనాపాలనా చూసుకునే నాథుడే లేడు. దాదాపు నెల రోజుల క్రితం పార్కులోని 'కోనో కార్పస్' చెట్లను కొట్టేసి వాకర్స్ నడిచేందుకు వీలు లేకుండా వాక్కింగ్ ట్రాక్ పై పడేశారు మున్సిపల్ సిబ్బంది.
గత సంవత్సరం క్రితం జిమ్ పరికరాలు విరిగి పడిపోయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బీరు సీసాలతో, వాడిన వాటర్ బాటిల్స్ తో, తినుబండారాలు, విరిగిపోయిన డస్టు బిన్ లు, నిల్వ నీటి తో పార్కు అంతా దోమలు, ఈగలతో అపరిశుభ్రంగా ఉంది. మానసిక ప్రశాంతతకు, ఒత్తిడి నుండి ఉపశమనానికి, ఆరోగ్యంగా ఉండేందుకు జిమ్, వాకింగ్ కోసం పార్కు లోకి వెళ్లాలంటేనే ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ద్వారా పార్కును శుభ్రపరిచి, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకుల పై ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.