నిండు కుండలా రామన్ పాడ్ జ‌లాశ‌యం.. 6 గేట్లు ఎత్తివేత‌

రాష్ట్రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు దంచికొడుతున్నాయి.

Update: 2024-09-01 07:02 GMT

దిశ, మదనాపురం : రాష్ట్రంలో మ‌ళ్లీ వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండ‌ను త‌ల‌పిస్తున్నాయి. రామన్ పాడ్ జ‌లాశ‌యానికి కూడా వ‌ర‌ద కొన‌సాగుతోంది. ప్రాజెక్టు 6 గేట్ల ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. రామన్ పాడ్ ప్రాజెక్టు ఇన్‌ ఫ్లో 3500 క్యూసెక్కులుగా ఉంది.

ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుండి 13 గేట్లు, సరళా సాగర్ నుండి శంకర్ సముద్రం రిజర్వాయర్‌ నుంచి రెండు గేట్లు ఎత్తగా వరద పోటెత్తింది. ప్రస్తుతం ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు రామన్ పాడ్ ఇరిగేషన్ ఏఈ రనిల్ రెడ్డి తెలిపారు.


Similar News