Transfer: వనపర్తి జిల్లాలో అధికారుల బదిలీలు

వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ),స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,ఆర్డీవో బదిలీ అయ్యారు.

Update: 2024-10-28 13:18 GMT

దిశ,వనపర్తి : వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ),స్పెషల్ డిప్యూటీ కలెక్టర్,ఆర్డీవో బదిలీ అయ్యారు. అదనపు కలక్టర్ రెవెన్యూ యం నగేష్ ను మెదక్ జిల్లా కు,మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ను వనపర్తి జిల్లా అదనపు కలక్టర్ (రెవెన్యు)గా బదిలీ అయ్యారు. అలాగే ఆర్డీఓ పద్మావతిని నారాయణపేట స్పెషల్ డిప్యూటీ కలక్టర్ గాను.. ఆర్డీఓ నారాయణపేట మధు.మోహన్ ను వనపర్తి స్పెషల్ డిప్యూటీ కలక్టర్ (ఎస్.డి.సి) గా బదిలీ చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి స్పెషల్ డిప్యూటీ కలక్టర్ సి.హెచ్ వెంకటేశ్వర్లు ను భూపాలపల్లి కి బదిలీ చేస్తూ.. నల్గొండ ఎస్.డి.సి దరూరు సుబ్రమణ్యం ను వనపర్తి ఆర్డీఓ గా బదిలీ చేశారు. ఎం.నగేష్ సుమారు తొమ్మిది నెలలు వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ)గా విధులు నిర్వర్తించారు.


Similar News