Bus stand :బస్ స్టాండ్ లో అనాథ వృద్ధుడికి అండగా..

జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో ఓ అనాథ వృద్ధుడు బస్ స్టాండ్ కంట్రోలర్ అండగా నిలిచారు.

Update: 2024-10-28 12:27 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలోని బస్ స్టాండ్ లో ఓ అనాథ వృద్ధుడు బస్ స్టాండ్ కంట్రోలర్ అండగా నిలిచారు. బస్ స్టాండ్ కంట్రోలర్ అంజిలయ్య వృద్ధుడి దగ్గరకు వెళ్ళి ఆరా తీయగా.. తనది బళ్ళారి అని,తన పేరు రమాకాంత్ అని తెలిపాడు. అలాగే వారం రోజుల క్రితం మహబూబ్ నగర్ కు వచ్చానని..ఎందుకు వచ్చావని మిగతా వివరాలకు కోసం అడిగితే..ఏమో ఎందుకు వచ్చానో తెలిదన్నారు. అలాగే తన దగ్గర ఉన్న బ్యాగు,బట్టలు,నగదు ఎవరో తనను కొట్టి దొంగిలించారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను బళ్ళారికి పంపాలని కోరాడు. ఒంటిపై బనియన్,నిక్కర తో ఉన్న ఆయన మానసిక స్థితి బాగాలేదని గ్రహించి,వెంటనే జిల్లా వృద్ధుల సంక్షేమ అధికారి కార్యాలయ క్షేత్రస్థాయి అధికారి నాగరాజు కు సమాచారం అందించగా..జిల్లా సంక్షేమ అధికారి జరినా బేగం ఆదేశాల మేరకు వృద్ధుడికి అల్పాహారం చేయించి కర్ణాటక బస్సులో బళ్ళారి కి పంపించారు. 


Similar News