ప్రజావాణికి 38 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.

Update: 2024-11-11 11:46 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల సమస్యలపై 38 ఫిర్యాదులను జిల్లా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగరావు లతో కలసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ... ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం కొసం దూర ప్రాంతాల నుండి నమ్మకంతో వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను అర్హతల మేరకు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.


Similar News