డీజీపీని కలిసిన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

తెలంగాణ డీజీపీ జితేందర్‌(DGP Jitender)ను శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి(Madhusudhanachari) కలిశారు.

Update: 2024-10-17 10:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డీజీపీ జితేందర్‌(DGP Jitender)ను శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి(Madhusudhanachari) కలిశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడి కుటుంబాన్ని కావాలనే ఇబ్బంది పెడుతున్నారని డీజీపీకి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బీసీలను రాజకీయంగా ఎదగకుండా చేస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లా పోలీస్ స్టేషన్లు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. తాము కేసులకు భయపడేరకం కాదని.. పేదల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు. కాగా, ఇటీవలే శాసన మండలి ప్రతిపక్ష నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.


Similar News