KCR, KTR, హరీష్, ఈటల, కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక విజ్ఙప్తి చేశారు.

Update: 2024-10-17 12:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులతో పాటు బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక విజ్ఙప్తి చేశారు. ‘మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదలు ఖాళీ చేసిన ఇళ్లల్లో మూడు నెలలు ఉండండి.. మీరుంటే ఆ అద్దెను కూడా నేనే కడతాను.. మూడు నెలలు అక్కడే ఉండి రాజకీయం చేయండి.. మీకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశిస్తున్నా. మీరు మూడు నెలలు అక్కడ నివాసం ఉండగలిగితే ప్రాజెక్ట్‌ను అర్ధాంతరంగా ఆపేస్తాం. మూసీ ప్రక్షాళన ఆపేస్తే టెండర్ అగ్రిమెంట్‌కి నష్టం జరిగితే నా సొంత ఆస్తి అమ్మి కడతా’ అని సీఎం రేవంత్ సవాల్ చేశారు. అంతేకాదు.. మూసీ ప్రాజెక్ట్‌‌పై అసెంబ్లీలు సమావేశాలు పెడదామని.. విపక్షాలు సలహాలు, సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తామని అన్నారు.

మీరు ఎన్ని రోజులంటే అన్ని రోజులు అసెంబ్లీ సమావేశాలు పెడదామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లోనే అనుమానాలు అన్నీ బయటపెట్టండి. ప్రతీ ప్రశ్నకు తానే స్వయంగా సమాధానం చెబుతానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తాము చేపడుతున్నది మూసీ సుందరీకరణ కాదు.. మూసీ నది పునరుజ్జీవనమని సీఎం రేవంత్‌ తెలిపారు. అంతకుముందు సచివాలయంలో మూసీ ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మూసీ పరివాహక ప్రజలకు మంచి జీవితం ఇవ్వాలనేది ఈ ప్రభుత్వ ఆలోచన. మూసీ నది కాలుష్యానికి ప్రతీకగా మారింది. 1600కు పైగా నివాసాలు పూర్తిగా మూసీ నది గర్భంలో ఉన్నాయి. నిర్వాసితులకు రెండుపడక గదుల ఇళ్లు కేటాయించి ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.


Similar News