ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్

ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క(Minister Seethakka) వార్నింగ్ ఇచ్చారు. గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో మంత్రి సమావేశం అయ్యారు.

Update: 2024-10-17 13:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క(Minister Seethakka) వార్నింగ్ ఇచ్చారు. గురువారం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధికారులతో మంత్రి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దని హితవు పలికారు. పోడు భూములపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. కొమురంభీం ప్రాజెక్ట్‌(Komaram Bheem Project)ను టూరిజంపరంగా అభివృద్ధి చేస్తామని కీలక ప్రకటన చేశారు. ఆడవాళ్ల జోలికి వస్తే ఎవర్నీ వదలం అని మాస్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కీలక ప్రకటన చేశారు.

అంతకుముందు బతుకమ్మ చీరల విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సీతక్క కౌంటర్ ఇచ్చారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం అడుగడుగునా మహిళల ఆత్మ గౌరవాన్ని కించపరిచిందని గుర్తుచేశారు. పదేళ్ల గత పాలకుల తప్పిదాలను సరి చేస్తూనే, మహిళా సాధికారత లక్ష్యంగా తాము పని చేస్తున్నామని ఆమె వివరించారు. పదేళ్ల నాడు బతుకమ్మ చీరలంటూ సూరత్ నుంచి నాశిరకం పాత చీరలు తెచ్చి పండగ పూట తెలంగాణ ఆడ బిడ్డలను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదేనని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదికి రూ. 300 కోట్లతో నాటి ప్రభుత్వం బతుకమ్మ చీరలు కొనుగోలు చేసినా, మహిళలు వాటిని ఏనాడూ కట్టుకోలేదని వివరించారు.


Similar News