Revanth Reddy: దేవిశ్రీ ప్రసాద్‌ను వివాదంలోకి లాగిన సీఎం రేవంత్ రెడ్డి.. షాక్‌లో అభిమానులు
టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, సినిమా: టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్(Devisri Prasad) ఇటీవల మ్యూజిక్ లవర్స్‌కు గుడ్ న్యూస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 19న ఓ మ్యూజికల్ కాన్సర్ట్ (Musical Concert)చేయబోతున్నట్లు దానికి అందరూ రావచ్చని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. లైవ్ ఇండియా టూర్‌లో భాగంగా.. తన ఫస్ట్ కాన్సర్ట్‌ను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ లైవ్ కాన్సర్ట్ గచ్చిబౌలి స్టేడియంలో అక్టోబర్ 19న సాయంత్రం జరగనుంది. ఈ ఈవెంట్‌ను ACTC అనే సంస్థ నిర్వహిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి సీఎం రేవంత్ రెడ్డి పర్మిషన్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కాన్సర్ట్‌కు హాజరయ్యేందుకు దేవిశ్రీ(Devisri Prasad) అభిమానులు విజిటింగ్ పాస్‌లను కూడా వేలు ఖర్చు చేసి కొన్నారు. అయితే ఈ కాన్సర్ట్‌కు దేవిశ్రీ పలువురు సినీ స్టార్స్‌ను ఆహ్వానించడంతో పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కూడా పిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా నెట్టింట షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మ్యూజిక్ కాన్సర్ట్‌కు రేవంత్ పర్మీషన్ ఇవ్వడం కొత్త వివాదానికి దారితీసింది. ఇందులో దేవిశ్రీ చిక్కుకున్నట్లు అయింది.
అసలు విషయం ఏంటంటే.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)గతంలో ఓ సభలో గచ్చిబౌలి స్టేడియంలో కేవలం క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్ తప్ప మరే ఇతర ఈవెంట్స్ నిర్వహించమని వెల్లడించారు. కానీ ఇప్పుడు దేవిశ్రీ మ్యూజిక్ కాన్సర్ట్‌కు పర్మిషన్ ఇవ్వడంతో పాత వార్తను షేర్ చేస్తూ ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా అసలు ఆ కాన్సర్ట్ పెట్టడానికి వీలు లేదని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అప్పుడు ఒకలా చెప్పి ఇప్పుడు మాట మారుస్తున్నారని విమర్శలు చేస్తున్నారు. ప్రజెంట్ పలు ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో వివాదంలోకి దేవిశ్రీని లాగినట్లు అయింది. అసలు పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే ఇతర ప్రాంతంలో పెట్టుకునే వారు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇక వాటిని చూసిన దేవిశ్రీ అభిమానులు షాక్ అవుతున్నారు. కాన్సర్ట్ క్యాన్సిల్ అయితే డబ్బులు వృధా అవుతాయేమోనని ఆలోచనలో పడ్డారు.