Liquor prices:మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న మద్యం ధరలు?

రాష్ట్రంలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. మద్యం ధరల(Alcohol prices) పెంపునకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Update: 2024-10-17 11:38 GMT

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో మందుబాబులకు బిగ్ షాక్ తగలనుంది. మద్యం ధరల(Alcohol prices) పెంపునకు తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) సిద్ధమైనట్లు తెలుస్తోంది. బీర్ల ఉత్పత్తి కేంద్రాలకు చెల్లించే ధరలను సర్కార్ రెండేళ్లకొకసారి పెంచుతోంది. ఈ సారి వివిధ రకాల బ్రాండ్ల పై రూ.20-150 వరకు పెంచాలని బ్రూవరీలు(Breweries) ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు త్వరలోనే ప్రభుత్వం(Government) ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం ధరలు 15 శాతం వరకు పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. మద్యం ఆదాయాన్ని(Income) ఎక్సైజ్ శాఖ(Excise Department) అదనంగా మరో రూ.5,318 కోట్లకు పెంచాలన్న ప్రభుత్వ ఆదేశాలు ధరల పెంపునకు మరో కారణంగా తెలుస్తోంది.

తెలంగాణ(Telangana)లోని 6 బ్రూవరీల్లో ఏటా 88 కోట్ల లీటర్ల బీరు ఉత్పత్తి అవుతోంది. ప్రతి ఏడాది దసరా పండుగ(Dussehra festival) సమయంలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి. ఈసారి పది రోజుల వ్యవధిలో రూ.1,100 కోట్లకు పైగా మద్యాన్ని తెలంగాణ మందుబాబులు తాగేశారు. మద్యం అమ్మకాల్లో ఈసారి కూడా హైదరాబాద్(Hyderabad) ముందు నిలిచింది. ఈ నెల ప్రారంభం నుంచి 11వ తేదీ వరకు రూ.1,100 కోట్ల విలువైన 10 లక్షల 44 వేల కేసుల మద్యం అమ్మకాలు జరిగాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. 

Tags:    

Similar News