Legislative Council: ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుందాం.. మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంలో తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాన్ని అదర్శంగా తీసుకుని మందుకెళ్దామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల (BC Reservations) అంశంలో తమిళనాడు (Tamilnadu) రాష్ట్రాన్ని అదర్శంగా తీసుకుని మందుకెళ్దామని ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పిలుపునిచ్చారు. ఇవాళ శాసన మండలి (Legislative Council)లో ఆయన రాజకీయ, విద్య, ఉద్యోగ అవకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ రెండు వేర్వేరు బీసీ రిజర్వేషన్ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సోమవారం శాసనసభ (Assembly)లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంపునకు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించుకున్నామని తెలిపారు.
బిల్లుకు బీఆర్ఎస్ (BRS), బీజేపీ (BJP), సీపీఐ (CPI), ఎంఐఎం (MIM) పార్టీలు మద్దతును ఇచ్చాయని గుర్తు చేశారు. ప్రస్తుతం కేవలం ఒకే ఒక్క తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్దామని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. రాజకీయంగా భిన్న అభిప్రాయాలు ఉండొచ్చని కామెంట్ చేశారు. పార్టీలకు అతీతంగా అంతా కలిసి ఢిల్లీ (Delhi) వెళ్లి బీసీ రిజర్వేషన్ (BC Reservation) బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుదామని అన్నారు. తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లు భవిష్యత్తులో దేశానికి రోల్ మోడల్‌గా అవతరించబోతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.