ఆ ఎమ్మెల్యే లేకపోయినా ఆయన కోరిక తీరింది : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల మొదటి రోజు సంతాప తీర్మాణాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాల మొదటి రోజు సంతాప తీర్మాణాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు.అత్యంత సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేత సాయన్న అన్నారు. ప్రజలకు సేవలు చేస్తూనే ఆయన మరణించారని, ఆయన వారసురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన లాస్య నందిత ప్రమాదవశాత్తు మరణించడం బాధకారమన్నారు. సాయన్న మన మధ్యలేకపోయినా ఆయన కల నెరవేరిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో కలపాలని ఆయన కోరిక నెరవేరిందని తెలిపారు. ప్రస్తుతం ఆయన భౌతికంగా ఉంటే చాలా సంతోషించేవారని, కనీసం ఆయన వారసురాలిగా వచ్చిన లాస్య సందిత ఉన్నా ఆనందించేవారని అన్నారు. కీలకమైన ఈ సమయంలో వారిద్దరు మన మధ్యలేకపోవడం బాధాకరని సీఎం విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.