TG Assembly: హరీష్‌రావు‌ నా వర్జినాలిటీ మీకు తెలియదు.. నా జోలికి రాకండి: కూనంనేని ఫైర్

తెలంగాణలో ధరణి మాదిరి కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద కుంభకోణం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు.

Update: 2024-07-27 13:18 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ధరణి మాదిరి కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద కుంభకోణం అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇవాళ ఆయన అసెంబ్లీ సమావేశంలో పలు విషయాలు ప్రస్తావించారు. తెలంగాణలో జరిగిన అతిపెద్ద కుంభకోణం ధరణి అని వెల్లడించారు. భూములు తిరిగి పట్టాదారులకు వెళ్తుందన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ధరణి సరి చేస్తున్నాం అంటున్నారు.. ఎక్కడ సరి చేశారు అనేది తెలియడం లేదన్నారు. దళిత, గిరిజనులకు నిధులు బాగానే కేటాయించారని పేర్కొన్నారు. దివ్యాంగులను అవమానించే విధంగా ఒక ఐఏఎస్ వ్యాఖ్యానించారని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు సంరక్షణ మాదిరి వారికి ఒక చట్టం తేవాలని కోరారు. ప్రతి జిల్లాలో విద్య,వైద్య రంగానికి ఒక్కో ఐఏఎస్ అధికారిణి నియమించాలన్నారు. ఇరిగేషన్ అంటే ఏటీఎంగా మారిందన్నారు.

ధరణి మాదిరి అతి పెద్ద కుంభకోణం కాళేశ్వరం ప్రాజెక్టు అని, నీటి లభ్యత లేదు అన్న సాకు తో రీడిజైన్ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం వద్దు అంటే.. మూడు బ్యారేజ్‌లు మాత్రమే వద్దు అని.. మిగితా అన్ని మల్లన్న సాగర్‌తో ఉపయోగం ఉంటుందన్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు హరీష్ రావుకు ఇబ్బంది అవుతుందని, హరీష్ రావు నా వర్జినాలిటీ ఇంకా మీకు తెలియదు.. నేను ఇంకా అన్ని విషయాలు మాట్లాడితే బాగుండదు.. నా జోలికి రాకండి అని ఫైర్ అయ్యారు.

బడ్జెట్ మీద అనేక మంది మాట్లాడిన తర్వాత చాలా ఆశ్చర్యం వేస్తుందన్నారు. అన్నప్రాసన రోజే.. ఆవకాయ తీనమన్నట్లు చేస్తున్నారని, అంత ఇప్పుడే అయిపోయింది అన్నట్లు మాట్లాడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నారు. గత ప్రభుత్వం ఏం చెప్పి చేయలేదో ఈ ప్రభుత్వంలో ఉన్న వారు చూశారని, కాబట్టి ఆ పొరపాట్లు చేస్తారు అని అనుకోవడం లేదన్నారు.

Tags:    

Similar News